రెండు విజ‌యాలు సాధించిన త‌ర‌వాత క‌థ‌ల విష‌యంలో మ‌రింత జాగ్ర‌త్త‌లో ప‌డిపోయ‌డు నితిన్‌. ప్రేమ‌, రొమాన్స్‌, వినోదం ఉన్న క‌థ‌లైతేనే చెప్పండి అంటూ హుకుం జారీ చేస్తున్నాడ‌ట‌. మాస్ బాట ప‌ట్టి ఎంత త‌ప్పు చేశాడో ఇప్ప‌టికైనా అర్థ‌మైంద‌న్న మాట‌. అంతేకాదు.. మ‌ల్టీస్టార‌ర్ క‌థ‌లుంటే చెప్పండి. క‌థ న‌చ్చితే నా పాత్ర గురించి ప‌ట్టించుకోను.. అని చెబుతున్నాడ‌ట‌.  

''మ‌ల్టీస్టార‌ర్ సినిమాల‌కు ఇప్పుడు మంచి మార్కెట్ ఉంది. ఇద్ద‌రు ముగ్గురు హీరోలు క‌లిసి చేస్తే ఆ క్రేజ్ వేరుగా ఉంటుంది. నాకూ అలాంటి అవ‌కాశం వ‌స్తే బాగుండును..'' అంటున్నాడు నితిన్‌.

మ‌రి నితిన్ ద‌గ్గ‌ర‌కు అలాంటి క‌థ ఎవ‌రు తీసుకెళ్తారో మరి??

మరింత సమాచారం తెలుసుకోండి: