వైవిఎస్ చౌద‌రి ముందే చెప్పి మ‌రీ హిట్టు కొట్టిన చిత్రం సీత‌య్య‌. ఎవ‌రి మాటా విన‌డు అనే క్యాప్ష‌న్‌తో వ‌చ్చిన ఈ సినిమా వంద రోజులు ఆడింది. ఒక్క మ‌గాడూ.. అంటూ సిమ్రాన్ వేసిన చిందులు.. మాంఛి ఊపు తెచ్చాయి. ఈ సినిమాకి సీక్వెల్ తీయాల‌ని చౌద‌రి ప్లాన్ చేస్తున్నాడు.

నంద‌మూరి హ‌రికృష్ణ కుమారుడు.. ఎన్టీఆర్‌తో సీక్వెల్ తీస్తే ఎలా ఉంటుందా?  అని ఆయ‌న ఆలోచిస్తున్నాడు. సీత‌య్య‌కి పెట్టిన క్యాష్ష‌న్ ఎవ‌రి మాటా విన‌డు.. టైటిల్‌గా మారింది. అస‌లు ఎన్టీఆర్‌తో వైవిఎస్ ఎప్పుడో సినిమా తీయాల్సింది. ఒక్క మ‌గాడు టైటిల్‌... ఎన్టీఆర్‌దే అనుకొన్నారు. అయితే అదే టైటిల్‌తో బాల‌కృష్ణ‌తో సినిమా తీశాడు వైవిఎస్‌. క‌నీసం ఇప్పుడైనా ఎన్టీఆర్ ఛాన్స్ ఇస్తాడా?  లేదంటే చౌద‌రి మ‌రో హీరోని ఎంచుకోవాలా??  కొద్ది రోజుల్లో ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు దొర‌క‌వ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: