చంద్ర‌శేఖ‌ర్ యేలేటి... పేరు చెప్ప‌గానే సాఫ్ట్ సినిమాలే గుర్తొస్తాయి. ఐతే, ప్ర‌యాణం సినిమాల‌తో త‌న మార్కు చూపించుకొన్నారు. ఒక్క‌డున్నాడులో కాస్త యాక్ష‌న్ కూడా క‌ల‌గ‌లిపారు. అయితే ఆ సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర నిల‌వ‌లేదు. అలాగ‌ని... యాక్ష‌న్ సినిమాల్ని మానేయ‌లేదాయ‌న. ఈ సారి పూర్తి స్థాయి యాక్ష‌న్ ఎడ్వేంచ‌ర్ సినిమా చూపించ‌బోతున్నారు. అదే సాహ‌సం.

గోపీచంద్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్ర‌మిది. తాప్సి క‌థానాయిక‌. చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. త్వ‌ర‌లో పాట‌ల్ని..  ఈనెలాఖ‌రున సినిమానీ విడుద‌ల చేస్తారు. నిధుల అన్వేష‌ణ‌కు సంబంధించిన క‌థ ఇది. రాజ‌స్థాన్‌, జోర్డాన్‌ల‌లో ఎక్కువ భాగం తెర‌కెక్కించారు. గోపీచంద్ ఓ సెక్యూరిటీ గార్డ్‌గా క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రానికి శ్రీ సంగీతం అందించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: