గురువుని మించిన శిష్యుడు అనిపించుకోవ‌డం మామూలే! కానీ రాజ‌మౌళి దానికి ఓ మెట్టు పైకి ఎదిగాడు. త‌న గురువునే శిష్యుడిగా చేసుకొంటున్నాడు. విష‌యం ఏమిటంటే.... రాజ‌మౌళి కొన్నాళ్ల పాటు ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు ద‌గ్గ‌ర శిష్యరికం చేశారు. స్టూడెంట్ నెంబ‌ర్ వ‌న్ సినిమాకి రాజ‌మౌళి ద‌ర్శ‌కుడే, కానీ ఆ సినిమాని పూర్తిగా న‌డిపించింది ద‌ర్శ‌కేంద్రుడు. అలాంటి గురువు.. ఇప్పుడు జక్క‌న్న ద‌గ్గర శిష్య‌రికం చేయ‌డానికి ఉత్సాహం చూపిస్తున్నారు.

బాహుబ‌లి క‌థ‌ను ఈమ‌ధ్యే మ‌ర్యాద పూర్వ‌కంగా గురువుగారికి వినిపించాడు రాజ‌మౌళి. విన‌గానే రాఘ‌వేంద్ర‌రావు ఫ్లాట్ అయిపోయారు. ఇలాంటి సినిమాకి ప‌నిచేయాల‌ని వుంది.. అని శిష్యుడితో చెప్పార‌ట‌. క‌నీసం స‌హాయ ద‌ర్శ‌కుడిగానైనా ప‌నిచేస్తా... అని చెప్పార‌ట‌. ఇంత గొప్ప క‌థ‌ని, నువ్వు ఇంకెలా తీస్తావో ద‌గ్గ‌రుండి చూస్తా..!  అన్నార‌ట.

బాహుబ‌లి క‌థ ఎంత న‌చ్చుంటే ఆయ‌న ఈ మాట అంటారు..?!  ద‌ర్శ‌కేంద్రుడి ద‌గ్గర ఫుల్‌గా మార్కులు కొట్టేసిన జ‌క్క‌న్న రేపు ప్రేక్ష‌కుల‌ను ఇంకెంత థ్రిల్ చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: