దేనికైనా రెడీ సినిమాతో వ‌చ్చిన పేరును కాపాడుకోవ‌డానికి విష్ణు నానా పాట్లూ ప‌డుతున్నాడు. బీభ‌త్స‌మైన  డాన్సులు వేసీ వేసీ.. మోకాళ్ల చిప్ప‌లు ప‌గ‌ల గొట్టించుకొంటున్నాడు. విష్ణు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం.. దూసుకెళ్తా. వీరూ పోట్లా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో ఓ పాట‌కు ప్రేమ్ ర‌క్షిత్ నృత్య‌రీతులు స‌మ‌కూరుస్తున్నాడు. ఆ పాట‌లో క్లిష్టత‌ర‌మైన భంగిమ‌లు ఉన్నాయ‌ట‌. అవి.. వేసీ వేసీ విష్ణుకి అప్పుడే కాళ్లు కొట్టుకుపోయాయ‌ట‌. క‌నీసం న‌డ‌వ లేక‌పోతున్నాడట‌. ఈ విష‌యాన్ని విష్ణు ట్విట్ట‌ర్‌లో షేర్ చేసుకొన్నాడు.

మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ సంస్థ నిర్మిస్తోంది. లావ‌ణ్య క‌థానాయిక‌గా న‌టిస్తోంది. విష్ణు అంత క‌ష్ట‌ప‌డి వేసిన డాన్సులు ఎలా ఉన్నాయో చూడాలంటే వెయిట్ అండ్ సీ.

మరింత సమాచారం తెలుసుకోండి: