ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాలో మ‌హేష్‌బాబు అతిథి పాత్ర‌లో కనిపిస్తాడా?  గ‌త కొన్ని రోజులుగా ఈ వార్త టాలీవుడ్‌లో చ‌క్క‌ర్లు కొట్టింది. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ సినిమాలో న‌టిస్తున్నారు ప‌వ‌న్‌. ఇందులో మ‌హేష్‌తో ఓ చిన్న పాత్ర వేయించాల‌ని త్రివిక్ర‌మ్ భావించారు. ఇందుకు సంబంధించి మ‌హేష్‌తో సంప్ర‌దింపులు కూడా చేశారు. అయితే దీనికి ప్రిన్స్ నుంచి స‌రైన స‌మాధానం రాలేదు. మ‌హేష్ మౌనం చూసి త్రివిక్ర‌మ్‌కి సీన్ అర్థ‌మైంది. దాంతో ఆయ‌న కూడా బ‌ల‌వంతం చేయ‌లేదు.

అయితే ఈ సినిమాలో మ‌హేష్ గొంతు మాత్రం వినిపిస్తుంది. ప్రిన్స్ ఈ సినిమాకి వాయిస్ ఓవ‌ర్ చెప్ప‌డానికి ఒప్పుకొన్నారు. జ‌ల్సాకి కూడా మ‌హేష్ గొంతు స‌హాయం చేశారు. ఇప్పుడు ఈ సినిమాకి. చూస్తుంటే టాలీవుడ్‌కి మ‌హేష్ గొంతుని వాడుకోవ‌డం సెంటిమెంట్ గా మారిపోతుందేమో అనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: