ఎప్పుడు చూసినా చిరంజీవిపై చిరుబురులాడిపోతుంటారు దాస‌రి. మైకు ప‌ట్టుకొంటే చాలు ప్ర‌త్య‌క్ష్యంగానో, ప‌రోక్షంగానో చిరుపై వ్యంగ్య బాణాలు సంధిస్తుంటారు. ఈ మ‌ధ్య మాత్రం కామ్ గా ఉండిపోయారు. చిరు గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడ‌డ‌డం లేదు. వెరైటీగా ఆయ‌న్ని పొగిడే కార్య‌క్ర‌మంలో దిగిపోయారు. చిరంజీవి రాజ‌కీయంగా ఉన్న‌త స్థాయికి ఎదిగితే చూడాల‌ని వుంది.. అంటూ కొత్త పాట పాడుతున్నారు.

అంతేకాదు.. చిరుని సినిమాల్లో స్టార్ హోదాలో చూస్తాన‌ని ఆయ‌న ముందే ఊహించార‌ట‌. అనుకొన్న‌ట్టుగానే చిరు స్టార్ అయిపోయాడ‌ట‌. అంటే ఇప్పుడు కూడా దాస‌రి జోస్యం ఫ‌లించ‌బోతుందా?  చిరు నాకు శ‌త్రువు కాదు.. అని ఈ లోకానికి దాస‌రి చెప్ప‌ద‌ల‌చుకొన్నారా?  దాస‌రి మ‌న‌సు మార‌డానికి కార‌ణం ఏమిటి?  ఇప్ప‌టి వ‌ర‌కూ క‌త్తులు దూసిన దాసరి స‌డ‌న్‌గా పంథా మార్చ‌డం వెనుక అస‌లు ర‌హ‌స్యం ఏముంది?  ఏమో రాజ‌కీయాల్లోనే కాదు... సినిమాల్లోనూ శాశ్వ‌త శ‌త్రుత్వాల‌కు చోటు లేదేమో?

మరింత సమాచారం తెలుసుకోండి: