ప్రముఖ గాయకుడు బాల సుబ్రహ్మణ్యం డబ్బింగ్ సీరియల్స్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాలు.. డబ్బింగ్ సీరియల్స్ నిషేధించాల్సిన అవసరం లేదని, నిషేధిస్తే చాలా మంది టెక్నీషియన్స్ ఉపాధి కోల్పోతారని వ్యాఖ్యానించారు. ఈ డిమాండ్ హర్షించదగినది కాదని అన్నారు. డబ్బింగ్ సీరియల్స్ కు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టిన బుల్లితెర ఆర్టిస్టులకు దర్శకరత్న దాసరి పూర్తిగా అండగా నిలిచారు. ఈ నేపథ్యంలో ఎస్పీ బాలు వారికి వ్యతిరేకంగా కామెంట్లు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

ఎస్పీ బాలు చేసిన వ్యాఖ్యలపై టివి ఆర్టిస్టులు ఫైర్ అయ్యారు. అండగా నిలవాల్సిన వారే.. ఇలా కించపరచి మాట్లాడడం తగదని మండిపడుతున్నారు. బాలు వ్యాఖ్యలను నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తీవ్రంగా ఖండించారు. డబ్బింగ్ సీరియల్స్ ఆపేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్కు వద్ద కొద్ది రోజులుగా బుల్లి తెర నటులు ఆందోళన చేస్తున్నారు. అయితే తాజాగా డబ్బింగ్ సీరియళ్ల విషయంలో టీవీ చానల్స్ సానుకూలంగా స్పందించడంతో టీవీ కళాకారులు ఇందిరాపార్కు వద్ద చేస్తున్న రిలే నిరాహార దీక్షలను విరమించారు. డబ్బింగ్ సీరియళ్లకు వ్యతిరేకిస్తూ 33 రోజుల పాటు టీవీ కళాకారులు దీక్షలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: