ప్రస్తుతంలో కర్ణాటకలో జరుగుతున్న ఎన్నికల కారణంగా ఒక హీరోయిన్ వివాదంలో చిక్కుకుంది. కన్నడ నటి ఐంద్రిత రై పైన ఎన్నికల కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

వివరాల్లోకి వెళితే.. ప్రముఖ కన్నడ నటి ఐంద్రిత రై ఎన్నికల కమీషన్ ప్రచార రాయబారిగా వ్యవహరిస్తున్నారు.  ‘మీ ఓటును తప్పక వేయండి’ అని నినాదంతో పాటు ఐంద్రిత రై ఫోటో ఉన్న హోర్డింగ్ లను ఎన్నికల కమీషన్  కర్ణాటక ఎన్నికల సందర్భంగా రాష్ర్టం అంతా విరివిగా ఏర్పాటు చేసింది. అవి ప్రజలను విశేషంగా ఆకర్సిస్తున్నాయి.

అయితే ఈ నెల 2న బెంగళూరులో భాజపా ఏర్పాటు చేసిన రోడ్ షో, ప్రచార సభల్లో ఐంద్రిత రై పాల్గొంది. ఆ పార్టీకి ఓటు వేయ్యమని చెప్పింది.

దీన్ని ఇతర పార్టీలు ఎన్నికల కమీషన్ దృష్టికి తీసుకుని వెళ్లాయి. ఎన్నిక కమీషన్ ప్రచార రాయబారిగా ఉన్న ఐంద్రిత రై బిజెపికి అనుకూలంగా ప్రచారం చేయడంపై ఇతర పార్టీలు మండిపడుతున్నాయి.

తమ ప్రచార రాయబారిగా ఉండి బిజేపికి అనుకూలంగా ప్రచారం చేసిన ఐంద్రిత రై పైన ఎన్నికల కమీషన్ కూడా సీరియస్ గా ఉంది. ఆమెపైన విచారణ కు ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: