సెక్సీభామ శ్రియకు ఇప్పుడు కాలం కలసిరావడం లేదు. తెలుగు, తమిళ సినిమాల్లో ఒక దశలో హల్ చల్ చేసిన శ్రియకు ఇప్పుడు అవకాశాలు గగనమయ్యాయి. దీంతో చివరికి వేశ్యగా నటించడానికి కూడా తయారయ్యింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, ప్రభాస్ వంటి అగ్రహీరోలతో కలిసి నటించిన శ్రియ తాజాగా ‘పవిత్ర’ లో వేశ్యగా నటించింది.

అన్ని కార్యక్రమాలు పూర్తి అయిన ‘పవిత్ర’ను ఈ నెల 10న విడుదల చేస్తున్నట్లుగా ముందుగా ప్రకటించారు. అయితే అదే రోజున యువ హీరోల సినిమాలు విడుదల అవుతుండంతో ఇప్పుడు ‘పవిత్ర’ను పక్కకు తప్పించారు. అలాగే తరువాత కూడా భారీ సినిమాలు విడుదల కానుండటంతో ఈ వేసవిలో ‘పవిత్ర’ విడుదల కావడం అనుమానమే అని తెలుస్తుంది.

శ్రియ ఎన్నో ఆశలు పెట్టుకుని నటించిన ‘పవిత్ర’ ఇలా విడుదల వాయిదా పడ్డం ఆమెకు మింగుడు పడ్డం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: