టాలీవుడ్ లో ఇప్పుడు ప్రచారం కొత్త పుంతలు తొక్కుతుంది. సినిమా ప్రచారాన్ని కూడా భారీగా నిర్వహిస్తున్నారు. సినిమా ప్రచారం కొత్త పద్దతులు అవలంభిస్తున్నారు. మెగా హీరోల్లో ఒకడైన అల్లు అర్జున్ తాజా సినిమా ‘జులాయి’ సినిమా కోసం ప్రత్యేకంగా ఒక ప్రచారగీతాన్ని తయారు చేసిన విషయం తెలిసిందే. తెలుగు సినిమాకు ఒక ప్రచార గీతాన్ని తయారు చేయడం ఇదే తొలిసారి. కాగా ఇప్పుడు మరో తెలుగు సినిమాకు ఇలా ప్రత్యేకంగా ప్రచార గీతం తయారు చేస్తున్నారు.

అక్కినేని నాగేశ్వరరావు మనవుడు సుశాంత్ నటిస్తున్న అడ్డా సినిమాకు ప్రత్యేకంగా ప్రచార గీతాన్ని తయారు చేస్తున్నారు. ఈ సినిమా కోసం అనూప్ రూబెన్స్ స్వరపరిచిన గీతాలు బాగా వచ్చాయని, ఈ ప్రోమో సాంగ్ తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతాయని సుశాంత్ అంటున్నాడు.

‘అడ్డా’ సినిమా బాగా వచ్చిందని, ఈ సినిమాతో తనకు మంచి హిట్ దొరుకుతుందనే ధీమాతో ఉన్నాడు సుశాంత్.

మరింత సమాచారం తెలుసుకోండి: