తెలుగు తెర సీతమ్మ అంజలి మళ్ళి వార్తలలోకి వచ్చింది . ప్రస్తుతం వెంకటేష్  బోల్ బచ్చన్ సినిమాలో నటిస్తున్న అంజలి తమిళంలో మరో సినిమా కూడా చేస్తోంది  మొత్తానికి ఇప్పుడు మంచి హుషారుగా ఉన్న ఈ అమ్మడు మనసు క్రికెటర్   విరాట్ కోహ్లి మీద మనసు పడిందా అని అనిపిస్తోంది .ఈ మధ్య  నీకెలాంటి భర్త కావాలని అంజలిని అడిగితే విరాట్ కోహ్లిలా మంచి హుషారుగా ఉండాలని, కోహ్లిలో ఉండే చురుకుదనం, అందం ఉండాలని టక్కున చెప్పేసింది అంజలి.

అంతేకాదు  తనకు  కాబోయే వాడు ఇంకా చాలా క్వాలిఫికేషన్స్ ఉండాలని, అసలు నున్నగా షేవ్ చేసుకోకూడదని, కేవలం ట్రిమ్ చేసుకోవాలని చెప్పింది.అంతేకాదు జీవితంలో ధృడమైన నిర్ణయాలు తీసుకోగలిగే మనస్తత్వం ఉండాలని, అలాంటి లక్షణాలున్న వ్యక్తి తనకు  భర్తగా రావాలని కోరుకుంటున్నానని చెప్పింది.అయితే ఇన్ని లక్షణాలు  ఉన్న వ్యక్తి మీకు ఎవరైనా  ఎదురయ్యరా అంటే, తనకు  కావాల్సిన వ్యక్తి తన కు  ఇంకా  దొరకలేదని చెప్పింది. ఇంతకీ అంజలి కోరుకొనే ఈ అందగాడు ఎక్కడ ఉన్నాడో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: