హీరో పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం చాల విభిన్నంగా ఉంటుంది. సమాజంలోని అసమానతలు, ఆర్ధికపరమైన తేడాలు పేదరికం గురించి ఆయన నిరంతరం ఆలోచిస్తూ ఉండటమే కాకుండా, తన మిత్రులతో కూడా ఈ విషయం గురించి చర్చిస్తూ ఉంటాడట. ఆయన గతంలో ఆనాటి ప్రజారాజ్యం పార్టీలో కొనసాగేడప్పుడు కూడా తన ఉపన్యాసాలలో ఈ విషయాల గురించి స్పందించేవారు. చాలాకాలం క్రిందట త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘జల్సా’ సినిమాలో కూడా ఈ అంశాలను పవన్ నటించిన పాత్రలో కొద్దిగా ప్రతిబింబించడం జరిగింది. ఇప్పుడు ఈ ఆలోచనలను పూర్తీ స్థాయిలో సినిమాగా తీసుకొచ్చే ప్రయత్నంలోనే పవన్ ‘కోబలి’ నిర్మిస్తున్నాడని అంటున్నారు. కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఆఫ్ బీట్ తరహాలో ఈ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ తన సొంత నిర్మాణ సంస్థ పవన్ క్రియేటివ్ ఆర్ట్స్ పతంకం పై నిర్మిస్తాడని వార్తలు ఫిల్మ్ నగర్ లో హాల్ చల్ చేస్తున్నాయి. ఈ వార్తలే నిజమైతే ఒక సామజిక చైతన్యంతో కూడిన సినిమా పవన్ నుండి త్వరలో రాబోతోంది అని అనుకోవాలి.....  

మరింత సమాచారం తెలుసుకోండి: