తెలుగులో ఇప్పుడు మల్టీస్టారర్ సినిమాల హవా నడుస్తోంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ బాటలో కొన్ని సినిమాలు రూపొందుతున్నాయి. మహేష్ తో కలిసి ‘సీతమ్మ వాకిట్లో..’ సినిమాలో  నటించిన వెంకటేష్ తాజాగా రామ్ తో కలిసి నటిస్తున్నాడు. అలాగే ప్రముఖ హీరోయిన్లతోనూ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కుతున్నాయి. ఎం.ఎస్.రాజు దర్శకత్వంలో ‘రమ్’ అనే సినిమాలో త్రిష, చార్మి, ఇషాచావ్లా, నికీషా పటేల్ కలిసినటిస్తున్నారు.

అలాగే, తెలుగులో మరో మహిళా మల్టీస్టారర్ సినిమా ప్రారంభం అయ్యింది. ఈ సినిమాలోనూ త్రిష ప్రధాన పాత్రలో నటిస్తుండగా పూనమ్ బాజ్వా, తమిళ నటి ఓవియా మిగిలిన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో మంగళవారం ఉదయం ప్రారంభం అయ్యింది. ముహూర్తపు షాట్ కు సీనియర్ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ క్లాప్ ఇచ్చారు.

ఈ సినిమాకు పాండ్యన్ దర్శకత్వం వహిస్తుండగా, డి.ఇమామ్ సంగీతం అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: