పాపం.. హ‌న్సిక చివరికి సేల్స్‌గాళ్‌గా మారింది. అవి కోనండి.. ఇవి కొనండి అంటూ డ‌బ్బాలు ప‌ట్టుకొని షాపింగ్ మ‌ల్‌లో అటూ ఇటూ తిరుగుతూ, క‌ష్ట‌మ‌ర్ల‌ను కాకా ప‌డుతూ.. నానా క‌ష్టాలు ప‌డుతోంది.  అయ్యో పాపం... ఇదేం ఖ‌ర్మ‌?? అనుకోకండి. ఇదంతా సినిమాకోస‌మే. శింభు-హ‌న్సిక జంట‌గా ఓ తమిళ చిత్రం రూపొందుతోంది. ఇందులో హ‌న్సిక‌ది సేల్స్‌గాళ్ పాత్ర‌.  

ఈపాత్ర‌లో జీవిస్తూ... అంద‌రినీ తెగ ఆక‌ట్టుకొంటోంది హ‌న్సిక‌. ``నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం. ఖాళీ దొరికితే ఏదో ఓ మాల్‌లో దూరిపోతా. అక్క‌డ సేల్స్‌గాళ్స్ ఎలా ప్ర‌వ‌ర్తిస్తారో నాకు తెలుసు. వాటినే నేను ఫాలో అవుతున్నా. అందుకే ఈ పాత్ర‌లో న‌టించడం పెద్ద క‌ష్టం అనిపించ‌డం లేదు`` అని చెప్తోంది. తెలుగులో స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ అనే సినిమాలో న‌టిస్తోంది. సిద్దార్థ్ క‌థానాయ‌కుడు. ఈనెల‌లోనే ఈ సినిమా విడుద‌ల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: