ఎట్ట‌కేల‌కు బాహుబ‌లి సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. కానీ ఇప్పుడు ఈ సినిమాకి ఓ కొత్త స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. బాహుబ‌లి.. క‌థాప‌రంగా విస్ర్కృతి ఎక్కువ‌. స్ర్కిప్టులో ఉన్న‌ది ఉన్న‌ట్టు తీస్తే... మూడుగంట‌ల‌కు పైనే వ‌స్తోంద‌ట‌. ఇంత నిడివిని ప్రేక్ష‌కులు చూడ‌గ‌ల‌రా?? అనేది రాజ‌మౌళి సందేహం. ఈ సినిమాని రెండు భాగాలుగా తీస్తే ఎలా ఉంటుంది?  అని కూడా ఆలోచిస్తున్నార‌ట‌. పైగా ఒకే సినిమాని రెండు సార్లు అమ్ముకోవ‌చ్చు. భారీ బ‌డ్జెట్ చిత్రం కాబ‌ట్టి - ఈ ఎత్తుగ‌డ నిర్మాత‌కు లాభాలు తెచ్చే అవ‌కాశాలున్నాయి.

అయితే పార్ట్ 1 తేడా కొడితే.. పార్ట్ 2 కొన‌డానికి ఎవ‌రూ ముందుకు రారు. దానితో పాటు ఈ సీక్వెల్ సూత్రం కూడా తెలుగు నాట విజ‌య‌వంతం కాలేదు. అందుకే ఒక సినిమానే విడుద‌ల చేయాలా?  లేదంటే రెండు భాగాలుగా చూపించాలా?  అనే విష‌యంలో రాజ‌మౌళి అండ్ టీమ్ ఏమీ తేల్చుకోలేక‌పోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: