నటి అంజలి రియల్ లైఫ్ స్టోరీ.. రీల్ లైఫ్ లా సాగుతోంది. అజ్ఞాతంతో మొదలైన కష్టాలు ఇంకా కంటిన్యూ అవుతూనే వున్నాయి. తాజాగా అంజలిపై తమిళ దర్శకుడు కళాంజియం పరువునష్టం దావా వేశారు. ఈ మేరకు సలెం మేజిస్ట్రేట్ కోర్టుకు పిటిషన్ సమర్పించారు. అంజలి చేసిన వ్యాఖ్యలు తన మద్దతుదారుల మనోభవాలు దెబ్బతినేవిధంగా ఉన్నాయని పిటిషన్ లో తెలిపారు. దీనిపై విచారణను కోర్టు ఈనెల13కు వాయిదా వేసింది.

కొద్ది రోజుల క్రితం పిన్ని భారతీదేవి, తమిళ దర్శకుడు కళంజియం తనను వేధిస్తున్నారంటూ ఆరోపించిన అంజలి.. అజ్ఞాతంలోకి వెళ్ళి చర్చనీయాంశంగా మారింది. ఆమె అజ్ఞాతం వీడి బయటికొచ్చి క్షమాపణలు చెప్పింది. అయినా అంజలికి ఆ సమస్యలు వెంటాడుతూనే వున్నాయి. కోర్టుల చుట్టూ తిరగకతప్పడం లేదు. ఇప్పటికే ఆమె పిన్ని భారతీదేవి అంజలిపై మద్రాసు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగా.. తాజాగా దర్శకుడు కళంజియం పరువునష్టం దావా వేశారు. మరి 'సీతమ్మ' కష్టాలు ఎప్పుడు తీరుతాయో..

మరింత సమాచారం తెలుసుకోండి: