ముంబాయిలో పెద్దపెద్ద కంపినీలు యిచ్చే పార్టీలకు ఎదురు డబ్బులు యిచ్చి హీరోయిన్స్ ను ఆ పార్టీలకు అతిధులుగా ఆహ్వనించడం ఆనవాయితీ. ఏచిన్న ఈవెంట్ ముంబాయిలో జరిగినా స్టార్ హీరోయిన్స్ సందడి చేస్తూనే ఉంటారు. ప్రస్తుతం చేయడానికి సినిమాలు లేక కేరాఫ్ ముంబాయిగా మిగిలిపోయిన మన తెలుగు ‘పవిత్ర’ శ్రేయ ఈ లేట్ నైట్ పార్టీల, సైడ్ బిజినెస్ చేసుకుంటోంది. చాలా మొబైల్ కంపినీలు ఇస్తున్న పార్టీలకు అతిధిగా తన గ్లామర్ తో తళుక్ మనిపిస్తూ శక్తి మేరకు డబ్బులు సంపాదిస్తోందని సమాచారం. యంగ్ హీరోయిన్ ల పోటీకి తట్టుకుని నిలబడలేక రేస్ లో వెనకబడిన శ్రేయ ప్రస్తుతం తన ఆశలన్నీ పుష్కలంగా డబల్ మీనింగ్ డైలాగ్స్ తో రూపొందిన ‘పవిత్ర’ సినిమా పైనే తన ఆశలన్నీ పెట్టుకుంది. ఈ సినిమా తరువాత అక్కినేని కుటుంబ కధా చిత్రంలో నటించబోతున్న శ్రేయ కెరియర్ కు టర్నింగ్ పాయింట్ వస్తుందేమో చూడాలి. లేదంటే సైడ్ బిజినెస్ లే శరణ్యం ....    

మరింత సమాచారం తెలుసుకోండి: