ప్ర‌స్థానం సినిమాతో తాను ఎంత మంచి న‌టుడో నిరూపించుకొన్నాడు సందీప్ కిష‌న్‌. ఆ త‌ర‌వాత క‌థానాయ‌కుడిగా ట‌ర్న్ ఇచ్చుకొన్నాడు. త‌న‌కు న‌ప్పే ల‌వ్ స్టోరీలు చేశాడు. ఇప్పుడు మాస్ ఇమేజ్ కోసం పాటు ప‌డుతున్నాడు. డికె బోస్ సినిమాలో కంత్రీ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. ఈ సినిమాలో ఫైటింగులూ కూడా చేశాడు.

స్టైలీష్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కించిన సినిమా.. త‌న‌లోని విభిన్న‌మైన న‌టుడిని బ‌య‌ట‌కు తీసుకొస్తుంద‌ని సందీప్ న‌మ్ముతున్నాడు. అన్న‌ట్టు త‌మిళంలో నూ ఓ హిట్టుకొట్టిన సందీప్‌... అక్క‌డ కూడా ఇలాంటి అవ‌కాశాలు వ‌స్తాయేమో అని ఎదురుచూస్తున్నాడు. ప్రేమ క‌థ‌లు చేయాల్సిన వ‌య‌సులో ఈ యాక్ష‌న్ ఇమేజ్ తాప‌త్రయం ఏమిటో??

మరింత సమాచారం తెలుసుకోండి: