ప‌వ‌న్ క‌ల్యాణ్‌కీ, హ‌రీష్ శంక‌ర్‌కీ మ‌ధ్య విబేధాలు వ‌చ్చాయా?  అందుకే గ‌బ్బ‌ర్ సింగ్ 2 ప్రాజెక్టుని హ‌రీష్‌కు కాకుండా సంప‌త్ నందికి అప్ప‌గించాడా?  ఈ విష‌యంపై గ‌త కొంత‌కాలంగా మెగా అభిమానుల మ‌ద్య ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ న‌డుస్తోంది. వాటికి చెక్ పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు హ‌రీష్ శంక‌ర్‌. ప‌వ‌న్ త‌న‌కు దైవం అనీ, దేవుడికీ భ‌క్తుడికీ మ‌ధ్య విబేధాలుఎందుకు వ‌స్తాయ‌ని చెబుతున్నాడు. అంతేకాదు.. త్వ‌ర‌లోనే ప‌వ‌న్‌తో ఓ సినిమా చేస్తాన‌ని మాటిచ్చాడు.

క‌థ కూడా రాసుకొంటున్నాడ‌ట‌. ఈసారి త‌న‌దైన క‌థ‌లో ప‌వ‌న్‌ని ప్ర‌జెంట్ చేస్తాన‌ని చెబుతున్నాడు. మరి ప‌వ‌న్ హ‌రీష్‌కి అవ‌కాశం ఇస్తాడా?  మరో గ‌బ్బ‌ర్ సింగ్‌లాంటి సినిమాని చూడ‌గ‌ల‌మా?  అనేది అంతుచిక్క‌ని ప్ర‌శ్న‌లు.

మరింత సమాచారం తెలుసుకోండి: