హుషారైన పాట‌ల‌తో.... ఆక‌ట్టుకొనే గాయ‌కుడు బాబా సెహ‌గ‌ల్. ఇప్పుడు న‌టుడిగా ట‌ర్న్ తీసుకొన్నాడు. గుణ శేఖ‌ర్ సినిమా రుద్ర‌మ‌దేవిలో ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సంద‌ర్భంగా బాబాకు గాయాల‌య్యాయి. అనుష్క‌, రానా, బాబాల‌పై ఓ యాక్ష‌న్ ఎపిసోడ్ తెర‌కెక్కిస్తున్న స‌మయంలో బాబా గాయ‌ప‌డిన‌ట్టు స‌మాచారం. వెంట‌నే స‌మీపంలోనే ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

బాబాను చికిత్స చేసిన వైద్యులు ఆయ‌న‌కు నాలుగు వారాల పాటు విశ్రాంతి కావాల‌ని చెప్పార‌ట‌. దాంతో అటు పాట‌ల‌కూ, ఇటు న‌ట‌న‌కూ తాత్కాలిక విరామం తీసుకొన్నాడు బాబా.

మరింత సమాచారం తెలుసుకోండి: