క్రియేటివ్ డైరెక్టర్ సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా “రేసు గుర్రం” సినిమా ఈనెల లోనే మొదలు అవుతుందని ఆమధ్య మీడియాలో వార్తలు తెగ వచ్చాయి. ఈ సినిమా షూటింగ్ మే 2 వ తారీఖున ప్రారంభం అవుతుందని ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపించాయి. కాని మే 10 వ తారీఖు వచ్చేస్తున్నా ఈ సినిమా ప్రారంభం గురించి ఎటువంటి వార్తలు లేవు. దీనిపై రకరకాల ఊహాగానాలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మూడ్ సరిగ్గా లేదని, దీనికి కారణం ఈనేలాఖరున విడుదల అవుతున్న “ఇద్దరమ్మాయిలతో...” సినిమాలో తన ఫైనల్ గేటప్ బన్నీ కి నచ్చలేదని, అందుకనే కొంత మూడీ గా ఉంటున్నాడని కొందరు అంటూ ఉంటె, మరికొందరు సురేంద్ర రెడ్డి చెప్పిన ఫైనల్ స్క్రిప్ట్ ఇంకా బన్నీ కి పూర్తిగా నచ్చలేదని, అందుకే ఈ ప్రాజెక్ట్ స్లో అయిందనే టాక్ వినిపిస్తోంది. ఈ వార్తలలో వాస్తవాలు ఏమిటో అటు బన్నీ కి ఇటు సురేంద్ర రెడ్డి కి మాత్రమే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: