సన్నీలియోన్ న‌టిస్తే మేం న‌టించం అని తెగేసి చెప్పారు. అక్షయ్‌కుమార్, క‌త్రినాకైఫ్ జోడీగా వ‌చ్చిన వెల‌కం మూవీ బాలీవుడ్ బాక్సాపీస్ వ‌ద్ద దుమ్మురేపింది. ఈ మూవీకు సీక్వెల్ ప్లాన్స్ జ‌రుగుతున్నాయి. అయితే అక్షయ్‌కుమార్‌కు ఈ మూవీకు ఎంత ఇంపార్టెంట్ అయినా, విలన్స్ నానాప‌టేక‌ర్, అనిల్‌క‌పూర్ కూడ అంతే ముఖ్యం. ఈ సీక్వెల్‌లో జాన్ అబ్రహం హీరోగా, మ‌ల్లికాశెరావ‌త్ ప్లేస్‌లో స‌న్నీలియోన్ తీసుకున్నారు.

అయితే ఇక్కడే చిక్కు వ‌చ్చింది. స‌న్నీలియోన్ మూవీలో మేము న‌టించేది లేదంటూ నానాప‌టేక‌ర్, అనిల్‌క‌పూర్  డెషిష‌న్ ఇచ్చేసారు. ఇప్పుడు స‌న్నీలియోన్‌ను మార్చేసి మ‌ళ్ళీ మ‌ల్లిఖాశెరావ‌త్‌ను తీసుకుంటారా, లేక వీళ్ళను రాజీ చేస్తారా అనేది బిటౌన్‌లో ఇంట్రెస్టింగ్ మ్యాటెర్‌.

వెల్‌కం టు మూవీకు స‌న్నీలియోన్ పారితోషికం అక్షరాల 5 కోట్లరూపాయ‌లు. మ‌రి ఈ అమౌంట్‌ను ఎలా సెటిల్ చేస్తారో అనేది మ‌రో బిగ్ క్వశ్చన్‌

మరింత సమాచారం తెలుసుకోండి: