రెండో గ‌బ్బర్‌ సింగ్ సినిమా మొద‌ల‌వ్వ‌డానికి ఇంకాస్త స‌మ‌యం ప‌ట్టేట్టు ఉంది. ఎందుకంటే గ‌బ్బ‌ర్ సింగ్ క‌థ ఇంకా రెడీ కాలేదు. ప్ర‌స్తుతం సంప‌త్ నంది ఆ ప‌నిలోనే ఉన్నాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ గ‌బ్బ‌ర్ సింగ్ 2 లైన్ చెప్పాడ‌ట‌. ఆ లైన్  ప‌ట్టుకొని క‌థ వండే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు యువ ద‌ర్శ‌కుడు. 

అందుకోసం సంప‌త్ పరుచూరి బ్ర‌ద‌ర్స్ స‌హ‌కారం కూడా తీసుకొంటున్నాడ‌ట‌. ర‌చ్చ సినిమాకి సంభాష‌ణ‌లు అందించింది ఈ బ్ర‌ద‌ర్సే. ప‌వ‌న్ ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అత్తారింటికి దారేది సినిమాలో న‌టిస్తున్నాడు. ఈలోగా గ‌బ్బ‌ర్ సింగ్ 2 క‌థ రెడీ అయితే ఒకే. లేదంటే... కోబ‌లి మొద‌లైపోతుంది. అంటే బంతి ఇప్పుడు సంత‌ప్ కోర్టులో ఉంద‌న్న‌మాట‌. 

మరింత సమాచారం తెలుసుకోండి: