సంజ‌య్‌ద‌త్ కెరియ‌ర్ బ్లాక్‌బ‌స్టర్‌గా నిలిచిన ఖ‌ల్‌నాయ‌క్ మూవీను రిమేక్ చేసే దిశ‌గా ఆలోచ‌న‌లు జ‌రుగుతున్నాయి. 1993 జూన్ 15న రిలీజ్ అయిన ఖ‌ల్‌నాయ‌క్ మూవీ ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో అందులోని పాట చోలి కే పీచే క్యా హై సాంగ్ కూడ అంతే వివాదాన్ని క్రియోట్‌చేసింది.ప‌ది సంవ‌త్సరాల‌కు ద‌గ్గర‌వుతున్న ఈ మూవీకు ద‌ర్శకుడు సీక్కెల్‌ను ప్లాన్ చేస్తున్నాడు. 

సంజ‌య్‌ద‌త్‌,మాధురి దీక్షిత్ ప్రధాన పాత్రధారులుగా వ‌చ్చిన ఈ మూవీలో, సీక్వెల్ హీరో,హీరోయిన్ ఎవ‌రు ఉంటారు అనేదానిపై ద‌ర్శకుడు క్లారిటి ఇవ్వలేదు. ఖ‌ల్‌నాయ‌క్ కు సంబంధించిన విష‌యాల‌ను ఒక ప్లాన్ ప్రకారం కాస్టింగ్ వివ‌రాలను త్వర‌లోనే తెలుపుతాము అన్నారు. ప్రస్తుతానికి నేటి స‌మ‌కాలిన స‌మాజానికి అతి ద‌గ్గర‌గా క‌థ‌ను రెడీ చేసుకుంటున్నాము. అదే ప‌నిలో బిజిగా ఉన్నాము. అంత‌కు మించి ఎక్కువ విష‌యాలు బ‌య‌ట‌కు చెప్పద‌లుచుకోలేదు అని ద‌ర్శకుడు సుభాష్ ఘూయ్ అన్నాడు.

ఖ‌ల్‌నాయ‌న్ మూవీ రిలీజ్ అయిన కొంత కాలానికి 1993 ముంబై బాంబ్ బ్లాస్ట్ కేసులో సంజ‌య్‌ద‌త్ కొంత‌కాలం జైలు పాల‌య్యాడు. అనాటి నుండి ఈనాటి వ‌ర‌కు సంజయ్‌ద‌త్‌ను ఈ కేసు వ‌దిలిపెట్టలేదు. రీసెంట్‌గా ఈ మూవీ సీక్వెల్ ప్లానింగ్ నాడే సంజ‌య్ జైలు జీవితానికి వెళ్లొచ్చనే వాద‌న‌లు విన‌ప‌డుతున్నాయి. సీక్వెల్ స్టార్ట్ అయితే నేటి ఖ‌ల్‌నాయ‌క్ హీరో ఎవ‌రు అనేదే బిటౌన్ క్వశ్చన్‌.
 

మరింత సమాచారం తెలుసుకోండి: