చాలా రోజులుగా అంద‌రి నోళ్లలో , మీడియాలో నానుతున్న  , చ‌క్కర్లు కొడుతున్న విష‌యం రాజ‌మౌళి డైరెక్షన్లో  ప్రిన్స్ త్వర‌లో న‌టించ‌బోతున్నాడ‌ని. ఇపుడు ఇదే విష‌యం మ‌ళ్లీ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయింది. బాహుబ‌లి త‌ర్వాత ప్రిన్స్్తోనే రాజ‌మౌళి సినిమా వుంటుంద‌ని..సినిమా పేరు రాజ‌ముద్ర  అని ఓ టాక్ వినిపిస్తోంది.  

ప్రిన్స్ తో మూవీ చేస్తే ఏ త‌ర‌హా క‌ధ తీసుకోవాలో మీరే చెప్పండి అంటూ ఓ ఆడియో వేడుక‌లో చెప్పిన  జ‌క్కన చివ‌రికీ మ‌హేష్ తో ఫాంట‌సీ ఫిల్మ్ బెట‌ర‌ని ఫిక్స్ అయ్యార‌ట‌..... దుర్గ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై కె.ఎల్.నారాయ‌ణ ఈ సినిమాను భారీ బ‌డ్జెట్ తో రూపొందించాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. నిజానికి ప్రస్తుతం బాహుబ‌లిపైనే త‌న దృష్టంతా పెట్టిన రాజమౌళి ప్రిన్స్ తో మూవీ గురించి కూడా ఆలోచిస్తున్నారని  ఆయ‌న స‌న్నిహితులు కూడా అంటున్నారు. గ‌తంలో కృష్ణ న‌టించిన సింహాస‌నం స్టైల్లో క‌ధ వుంటుందని... ఇప్పటికే రాజ‌మౌళి టీం క‌ధ వండుతున్నార‌ని లేటెస్ట్ ఫిల్మ్ న‌గ‌ర్ క‌బ‌ర్.  

ఇక బాహుబలి ఎలాగూ రెండేళ్లు ప‌డుతుంది కాబ‌ట్టి రాజ‌ముద్ర  2015లో సెట్స్ పైకి వెళ్లే అవ‌కాశం వుంద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాలు అంటున్నాయి. మ‌రి ఈ వార్తలో నిజ‌మెంతో తెలియాలంటే రాజ‌మౌళి ఒక క్లారిటీ ఇచ్చే  దాకా ఆగాల్సిందే...

మరింత సమాచారం తెలుసుకోండి: