శృంగారతారగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రమ్యశ్రీ. అనేక చిత్రాల్లో తన అందాలను ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆరబోసింది. ఇప్పుడు నీతులు చెప్పడానికి సిద్ధపడుతుంది. రమ్య శ్రీ ఇప్పుడు దర్శకత్వం వహిస్తుంది. అది కూడా మహిళల మీద జరుగుతున్న దురాగతాల మీద. 

మల్లి అనే పేద మహిళ సమాజంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాల మీద ఎలా పోరాడిందో అనే కథతో రమ్యశ్రీ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతుంది. వేరే నటి అయితే తాను ఉహించిన విధంగా నటించలేదనే భయంతో ప్రధాన పాత్రలో రమ్య శ్రీ నటిస్తుంది. ఈ ‘ఓ మల్లి’ సినిమాకు చెందిన ప్రచార చిత్రాలను తాజాగా విడుదల చేశారు. ఈ సందర్భంగా రమ్యశ్రీ మాట్లాడుతూ ‘ స్ర్తీల మనో వేదనకు అద్దం పట్టేలా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో చెప్పిన అంశాలు ప్రేక్షకులను ఆలోచింపచేస్తాయని’ చెప్పింది.

 రమ్యశ్రీ, ఆకాష్, రఘుబాబు, ఎల్బీ శ్రీరాం, ఫృథ్వీ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించగా బి.ఎస్.ప్రశాంత్ కుమార్ నిర్మించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: