చార్మి ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా జూన్ 7న విడుదల కానుంది. చందూ దర్శకత్వంలో వస్తున్న ‘ప్రేమ ఒక మైకం’ సినిమాలో చార్మి కీలక పాత్ర పోషిస్తుంది. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చలామణీ అయ్యిన చార్మి ఈ సినిమాలో వేశ్యగా నటిస్తుంది. దీంతో అందరి దృష్టి ఈ సినిమాపై ఉంది. చార్మీ కూడా ఎన్నో ఆశలు పెట్టుకుని ఈ సినిమాలో నటించింది. ఈ సినిమాతో తనకు మళ్లీ గుర్తింపు వస్తుందని చార్మి నమ్ముతుంది.

ఈ ‘ప్రేమ ఒక మైకం’ సినిమాను జూన్ 7న విడుదల చేస్తున్నారు. రాహుల్, శరణ్య, సోని చరిష్ట ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా చార్మి కాల్ గర్ల్ గా నటిస్తుంది. చార్మి పోషించిన మల్లిక పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తుందని చిత్ర యూనిట్ అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: