ఛార్మి....ఈ పేరు వింటే మంత్రలో మ‌హా మ‌హా అంటూ కుర్రకారుకి త‌న అందంతో కిర్రెక్కించిన బ్యూటీనే గుర్తోస్తుంది. నిజానికి  ఛార్మింగ్ గాళ్ ఛార్మికి న‌టిగా స‌రైన గుర్తింపు వ‌చ్చింది మంత్రతోనే. మంత్రలో గ్లామ‌ర్ అండ్ యాక్టింగ్ ఛార్మి మెస్మరైజ్ చేయ‌డంతో ఆఫ‌ర్లు వెల్లువెత్తాయి. వాటిలో హిట్స్ ఎన్ని అన్నది ప‌క్కన పెడితే ఛార్మింగ్ గాళ్ ఒక మంచి న‌టి అని ప్రూవ్ చేశాయి.

అందుకే త‌న సీని కెరీర్ కి లైఫ్ ని ఇచ్చిన డైరెక్టర్ తులసి రామ్ తో మ‌రోసారి వ‌ర్క్ చేయ‌డానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఈ సుంద‌రి. మంత్ర త‌రువాత తుల‌సి రామ్ చార్మితో మంగ‌ళ సినిమా చేసిన‌ప్పటికీ అది బాక్సాఫీస్ ద‌గ్గర మంగ‌ళం పాడింది.
దీంతో ఇటు ఛార్మికి , అటు త‌న‌కు మంచి హిట్ ప‌డాల‌ని తుల‌సి రామ్ అద్బుత‌మైన క‌ధ రాశాడ‌ట‌. ఆ క్రేజీ క‌ధ‌ను,

ఈ క్రేజీ కాంబినేష‌న్ లో మూవీని మంత్ర ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై సిహెచ్ వి శ‌ర్మ నిర్మించ‌బోతున్నారు. ప్రస్తుతం స్క్రీప్ట్ వ‌ర్క్ ఎండింగ్ లో వుంద‌ట‌. మ‌రి ముచ్చట‌గా మూడోసారి క‌ల‌సి చేస్తోన్న ఈ సినిమా అయినా ఇద్దరికీ లైఫ్ ని ఇస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: