తెలిసో, తెలియకో చేసిన ఒక నిర్వాకం హీరోయిన్ అంజలికి సీత కష్టాలు తెచ్చిపెడుతోంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఏ ముహూర్తంలో ఆమె సీత పాత్ర వేసిందో కాని అంజలి జీవితం అంతా వివాదాలమయం కాబోతోందా అనిపిస్తోంది.

అజ్ఞాతంలోకి పోయి పిన్నిని, డైరెక్టర్ కళైంజయం ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి సినీ వినీలాకాశంలో ఓ సంచలన తార అవుతామనుకుంది అంజలి. వారిద్దరు బిచ్చగాళ్లు అయినట్టు పిన్ని, డైరెక్టర్ కళైంజయం తన సంపాదన మెక్కి బతుకుతున్నారంటూ దుమ్మెత్తి పోసింది.

దీంతో తిక్కరేగిన కళైంజయం సేలం కోర్టులో పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది కోర్టు స్వీకరిస్తుందా, ఎంత మొత్తానికి దావా వేస్తే అందులో నాలుగోవంతు కోర్టులో డిపాజిట్ చేయాలి, కళైంజయం అది చేస్తారా.. ఏదో బెదిరించడానికి ఓ పిటిషన్ వేసారు అనుకుంది అంజలి.

కాని అన్నంత పనయింది, వారు డబ్బులు డిపాజిట్ చేయడం, ఆమె వారిని ఫోన్లో అన్న మాటలు, బయటకు వచ్చాక మీడియా ముందు తిట్టిన తిట్లు, మీడియాల క్లిప్పింగులు, వీడియో టేపులు అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పించారు కళైంజయం. దీంతో అది విచారణకు తీసుకుని అంజలికి కోర్టు సమన్లు జారి చేసింది. ఇక సినిమాల్లో అందాలు ఒలకబోయడం మాట అటుంచి నిజ జీవితంలో కోర్టు బోనెక్కి యాక్షన్ కు బదులు జీవించాల్సి ఉంటుందన్న మాట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: