తండ్రి పాటలు వ్రాస్తే తనయుడు సంగీతాన్ని ఇచ్చే అవకాశం చాలా కొద్ది మందికి లభిస్తుంది. ఒకే ప్లాట్‌లో ఉంటున్న రెండు కుటుంబాల మధ్య జరిగే కధతో 'ఎంత అందంగా ఉన్నావె'. చిత్రం రూపొందుతోంది. అజరు హీరోగా (నువ్విలా..ఫేం), జియాన నటీనటులుగా  రూపొందుతున్న సినిమా ఇది. ఈ సినిమాకు ప్రముఖ కవి  సిరివెన్నెల సీతారామశాస్త్రి తనయుడు యోగీశ్వరశర్మ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు, ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది.

సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆడియో సీడీలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ, తను  కథకు మొదటి స్థానం ఇస్తానని,  కథ నచ్చడంలో ఈ చిత్రానికి మూడు పాటలు రాశానని. ఒక కుటుంబానికి చెందిన ప్రేమకథ ఇద, అయిదు పాటలు 5 రకాలుగా ఉంటాయి అని అన్నారు. సిరివెన్నెల కుమారుడు సంగీత దర్శకుడు యోగీశ్వరశర్మ మాట్లాడుతూ... నాన్నగారు,  చక్కని సాహిత్యం అందించారు. టీమ్‌ వర్క్‌గా ఈ సినిమా పాటలు చాలా బాగా వచ్చాయి అని అంటూ తండ్రి రాసిన పాటలకు తనయుడిగా తను సంగీతం అందించడం తన అదృష్టం అని అన్నారు. పాటల రచయితగా మంచి పేరు తెచ్చుకున్న సిరివెన్నెల కుమారుడిగా యోగీశ్వరశర్మ ఎటువంటి మంచి పాటలకు సంగీతాన్ని అందించాడో చూడాలి..... 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: