షారుక్ ఖాన్ సినిమాలో ఎవరికైనా ఐటమ్ సాంగ్ చేసే అదృష్టం వస్తే ఎగిరి గంతేసుకుని ఒప్పుకుంటారు, కానీ నయనతార మాత్రం సింపుల్ గా ఆఫర్ కు నో చెప్పేసింది. కానీ ధనుష్ నిర్మిస్తున్న చిత్రం ‘ఎదిర్ నీచ్చల్’ సినిమాలో మాత్రం సోలో సాంగ్ కి స్టెప్స్ వేసింది నయన. లవ్ ఫేల్యూర్ మీద తెరకు ఎక్కించిన పాట ఇది అట. ధనుష్ పై ఉన్న అభిమానంతో నో చెప్పలేక నాయన్ స్టెప్పులు వేసిందని కొందరు అంటూ ఉంటే, పాటలోని లవ్ ఫేల్యూర్ అంశం బాగా నచ్చి నయన ఈపాటకు స్టెప్స్ వేయడానికి ఒప్పుకుందనీ మరికొందరు అంటున్నారు.

 ప్రభుదేవాతో లవ్ ఫేల్యూర్ అయిన దగ్గర నుంచి నయన్ కొద్దిగా నిరాశగా ఉందని అందరికీ తెలిసిన విషయమే. అయితే నయనతార మాత్రం తాను మొదటినుంచి ఐటమ్ సాంగ్ లకు దూరం అనీ, ఏదో ఒకటి రెండు పాటలు చేసినంత మాత్రాన తను శాస్వితంగా ఐటమ్ సాంగ్స్ చేస్తానని అనుకోవద్దు అంటూప్రకటనలు ఇస్తోంది....

మరింత సమాచారం తెలుసుకోండి: