పూరీ జగన్నాథ్ మరో సంచలనానికి సిద్ధపడుతున్నాడు. యువ హీరోలతో మల్టీస్టారర్ మూవీ చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఇందుకోసం కథను ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాతో జోరు మీదన్న నితిన్ ఈ సినిమాలో ఒక హీరోగా ఎంపిక అయ్యాడు. మరో హీరోగా అల్లు అర్జున్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందే ఈ మల్టీస్టారర్ మూవీని డి.ఎస్.రావు నిర్మిస్తారు. చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

కాగా, పూరీ జగన్నాథ్ ప్రస్తుతం ‘ఇద్దరమ్మాయిలతో.’ సినిమాలో బిజీగా ఉన్నాడు. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా మే చివరిలో విడుదల అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: