అల్లరి నరేష్ ‘యాక్షన్3డీ’   సినిమా పాటలను ఈ మధ్య   హైద‌రాబాద్‌ లో ప్రదర్శించారు. ఈ సంద‌ర్భంగా న‌రేష్ మాట్లాడుతూ “ఇలాంటి సినిమాలో న‌టించ‌డం చాలా గ‌ర్వంగా అనిపిస్తోంది. ‘లైఫ్ ఆఫ్ పై’, ‘ఐరెన్ మ్యాన్’ కంటే బెస్ట్ అవుట్ పుట్ వచ్చిందని అల్లరోడు అన్నాడు. ఈ సినిమాకు బ‌ప్పీల హ‌రి సంగీతం అందించ‌డం చాలా ఆనందంగా ఉంది అంటూ  స్వాతి ముత్యపు జ‌ల్లుల‌తో పాటంటే తనకెంతో  ఇష్టం, దాన్ని ఇప్పుడు రీమిక్స్ చేయ‌డం ఆనందంగా ఉంది అన్నారు. అల్లరోడి మాటలు విన్న చాలామంది ఈ సినిమా గురించి అంత విశేషాలు వాడాలా అంటూ కొద్దిగా షాక్ అయ్యారు.

ఇది ఇలా ఉండగా  ఈ మ‌ధ్య విడుద‌లైన యాక్షన్ త్రీడీ ట్రైల‌ర్లు కూడాకొంత అతి గానే అనిపిస్తున్నాయి. తాజాగా విడుదల అయిన ఈ సినిమా   ప్రచార చిత్రంలో స‌మంత టాపిక్ కూడా ఉంది.ఆ ట్రైలర్ లో హీరో లు నలుగురు మాట్లాడుకుంటూ ఉంటేఈ మాటలు వస్తాయి  ‘అంటే రాత్రి మ‌నం స‌మంత‌ను తీసుకెళ్లామ‌న్న మాట‌.. నిజంగా స‌మంత‌ను తీసుకెళ్లామా, తీసుకెళ్లి ఏమైనా చేశామా?’ అంటూ హీరోలు న‌లుగురూ నోట్లో నీళ్లు న‌లుముకొంటున్న సంభాషణలు వస్తాయి. ఇంత‌కీ ఆ స‌మంతను ఎవ‌రు, ఎందుకు తీసుకెళ్లారు తెలియాంటే యాక్షన్ త్రీడీ సినిమా వచ్చే దాకాఆగాల్సిందే .కానీ మరీ ఇంత ఓవర్  పబ్లిసిటీ  అసలుకు ఎసరు పెడుతుం దేమో అన్న విషయం అల్లరి నరేష్ ఆలోచించాలి...  

మరింత సమాచారం తెలుసుకోండి: