మాతృదినోత్సవం సంధర్భంగా ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తన తల్లి అక్కినేని అన్నపూర్ణ గురించి అనేక విషయాలు తెలిపారు. నాన్నగారు సినిమాలతో బిజీగా ఉంటే ఇంటి బాధ్యతలను, పిల్లల గురించి, కుటుంబ సంబంధాల గురించి తన తల్లే బాధ్యతలను నిర్వహించేదని తెలిపారు. అలాగే తన తల్లి అన్నపూర్ణ పచ్చళ్లు పెట్టడంలో నేర్పరని నాగార్జున చెప్పారు. వేసవిలో ఆమె పెట్టే ఆవకాయ గురించి నాగార్జున చెప్పాడు.

మా కుటుంబ సభ్యులు, చుట్టాలు అందరికీ ప్రతీ ఏడాది అమ్మే ఆవకాయ పచ్చడి పెట్టి పంపేది. అది ఎంత రుచిగా ఉండేదో నేను మాటల్లో చెప్పలేను. అమ్మ ఉండగానే నాన్న ఆవకాయ ఎలా పెట్టాలి అనేది పూర్తిగా ఓ పుస్తకంలో రాయించుకున్నారు. అమ్మ ఇప్పుడు లేకపోవడంతో ఆవకాయ పెట్టించే భాధ్యత నాన్న గారు తీసుకున్నారు. నాన్నగారు తయారు చేయించిన అవకాయ కూడా అమ్మ చేసినట్లే ఉందని నాగార్జున తెలిపారు.

ఎంతైనా అమ్మ లేని లోటు తిరిగిరాదని నాగార్జున తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: