అల్లరి న‌రేష్ చేసే ప‌నుల‌కు ఇండ‌స్ట్రీలో పెద్దలు సైతం న‌వ్వుకుంటారు. ఎందుకంటే మ‌నిషికి న‌వ్వు వ‌చ్చిన రాక‌పోయినా, అల్లరి న‌రేష్ త‌న మూవీలో కిత‌కిత‌లు పెడుతూనే ఉంటాడు. వాటిని చూసి న‌వ్వటం మ‌న వంతుపని. అయితే ఇప్పుడు నాగార్జున‌కి, అల్లరోడు ఓ లింకు ఉంది.

అల్లరి న‌రేష్ త‌న మూవీల్లో ఏదో ఒక రిమేక్ సాంగ్ చేసి అంద‌ర్నీ ఎంట‌ర్ టైన్ చేస్తాడు. త‌ను రిమేక్ చేసిన ఆ సాంగ్స్‌లో, మాంచి డ్యాన్సింగ్ మూమెంట్ ఉన్నది కాని, లేక మెలోడి కాని ఎంచుకుంటాడు. ఏది ఎలాగున్నా, ఆ సాంగ్ రిమేక్ చేస్తే అల్లరి అల్లరిగానే ఉంటుంది. త‌న లేటెస్ట్ మూవీ యాక్షన్ త్రిడిలో కూడ ఇటువంటి సాంగే ఒక‌టి పెట్టాడు. అదీనూ అక్కినేని నాగార్జున‌,అమ‌ల న‌టించిన ప్రేమ యుద్ధం మూవీలో ఫేవ‌ర్ సాంగ్ స్వాతి ముత్యపు జ‌ల్లుల‌లో...ఈ పాట ఇప్పటికి ఎవ‌ర్ గ్రీన్‌గానే ఉండిపోయింది.

ఇదే పాట‌ల‌ను యాక్షన్ త్రిడి లో రిమిక్స్ చేసి, నాగార్జున‌,అమ‌ల ఇద్దరూ ప్రేక్షకుల‌కు ఎటువంటి ఫీలింగ్ అయితే అందించారో, స‌రిగ్గా అదే ఫీలింగ్‌ను అల్లరిన‌రేష్‌, హీరోయిన్ నీలం గంగోపాధ్యాయ అందించారు. ఇప్పటి వ‌ర‌కు అల్లరోడు ఎన్నో రీమిక్స్‌ల‌ను దారుణంగా కైమా చేసాడు. వారిలో సూప‌ర్‌ కృష్ణ, చిరంజీవిలే అధికం.  మొద‌టిసారిగా ప్రేక్షకుల‌కు న‌చ్చే విధంగా నాగార్జున సాంగ్‌ను రీమిక్స్ చేసినందుకు సినీ అభిమానులు ఆనంద ప‌డుతున్నారు. ఇది నాగార్జున‌కు అల్లోరోడు ఇచ్చిన గౌరవం అని చెప్పుకుంటుంది. ఇక‌నైన త‌ను రీమీక్స్ చేస్తున పాట‌లకు ఇటువంటి గౌర‌వాన్ని క‌ల్పిస్తే, ఆ పాట‌ల‌ను గౌర‌వించిన వాడు అవుతాడ‌ని ఇండ‌స్ట్రీ భావిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: