నాగచైతన్య మాస్ సినిమాలకు పనికిరాడు అంటూ విమర్శకులు ఒక బ్రాండ్ ముద్రవేసిన నేపధ్యంలో విడుదలైన ‘తడాఖా’ పాజిటివ్ టాక్ తెచ్చుకుని నెమ్మదిగా కలెక్షన్స్ పరంగా నిబడుతోంది. మొట్టమొదటిసారిగా ఒక మాస్‌ సినిమాతో హిట్ టాక్ కొట్టాడు నాగచైతన్య. ఈ సినిమాలో చైతూ  చేసిన  కామెడి, రొమాన్స్‌, యాక్షన్‌లకు వచ్చిన పేరు చూస్తుంటే ఖచ్చితంగా మాస్‌ హీరో అన్నట్లే ఉన్నాడు అని అనిపిస్తుంది.

గత రెండు రోజులుగా ‘తడాఖా టీమ్ తో గ్రీకువీరుడు’ అంటూ హీరో నాగార్జున అన్ని ఛానల్స్ లోను తమన్నా – చైతూ లతో వరుసపెట్టి ఇంటర్యూలు చేస్తూ ఈ సినిమా ప్రచారానికి తన వంతు ప్రచారం చేస్తున్నాడు. అంతేకాదు తనకు తమన్నాతోటి కలిసి నటించాలని ఉందని కబుర్లు చెపుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు పోటీగా ఏసినిమా లేకపోవడం ఈ వారంకుడా పెద్ద సినిమాల హడావిడి ఏమిలేకపోవడం కూడా చైతన్యకు అదృష్టమే అనుకోవాలి. ఇదే ట్రాక్ కొనసాగిస్తే భవిష్యత్తులో నాగార్జున కలలను చైతూ నెరవేర్చి మరో మాస్ అనిపించుకునే  అవకాశాలు  ఉన్నాయి.....  

మరింత సమాచారం తెలుసుకోండి: