తెలుగులో క్లీన్ యూ సినిమాలు తీసి... ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకొన్నారు కృష్ణారెడ్డి. హీరో అయిపోదామ‌నుకొని.. ద‌ర్శ‌కుడిగా డౌన్‌ఫాల్ అయ్యాడు. తెలుగులో ఆయ‌న సినిమాలేమీ చేయ‌డం లేదు. ఈ మ‌ధ్య ఇంగ్లీషులో ఓ సినిమా తీశారు. అదే.. డైవ‌ర్స్ ఇన్విటేష‌న్‌!  తెలుగులో తీసిన ఆహ్వానం సినిమానే ఆయ‌న ఇంగ్లీషులో తీసేశార‌న్న‌మాట‌. ఈ సినిమాలో హ‌లీవుడ్ న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు ప‌నిచేశారు.

మ‌న ద‌ర్శ‌కుడు హ‌లీవుడ్ సినిమాని తీయ‌డం గొప్ప విష‌య‌మే. అయితే... ఆయ‌న ఎంచుకొన్న క‌థ ఎంత వ‌ర‌కూ యాప్ట్ అనేది ఆలోచించాలి. విడాకులు అనేది భార‌తదేశంలో చాలా సున్నిత‌మైన విష‌యం. ఫారెన్ లో చాలా సాధార‌ణం. దానికి అంత విలువ ఇవ్వ‌రు. మ‌రి అలాంటి చోట‌.. భార్యాభ‌ర్త‌ల గొప్ప‌ద‌నాన్నీ.. విడాకులు వ‌ద్దు. అనే మంచి మాట‌ని ఎలా చెప్పారో ఏమిటో?

మరింత సమాచారం తెలుసుకోండి: