టాలీవుడ్ లో మరో శుభకార్యం జరిగింది. హీరో గోపిచంద్ ఒక ఇంటివాడయ్యాడు. హీరో శ్రీకాంత్ మేనకోడలు రేష్మ-గోపిచంద్ ల వివాహం ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ వేడుక ను హైదరాబాద్ లోని  ఎన్.కన్వెన్షన్ సెంటర్ లో వైభవంగా  నిర్వహించారు. ఈ వేడుకకు వధూవరుల బంధు మిత్రులతో పాటు సినిమా, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు విచ్చేసి నూతన దంపతులను ఆశీర్వదించారు. 

ఈ వివాహమహోత్సవానికి మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు, ఈనాడు సంస్థల చైర్మెన్ రామోజీరావు, ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు, దగ్గుబాటి వెంకటేశ్వరావు దంపతులు, కృష్ణంరాజు దంపతులు, జగపతి బాబు, పవన్ కళ్యాణ్,  ప్రభాస్, రాజమౌళి తదితరులు హాజరయ్యారు.

గోపిచంద్ వివాహ మహోత్సవ వేడుక ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: