అల్లరి నరేష్ మరోసారి తన మార్కు ప్రేక్షకులకు చూపించనున్నాడు. తన కొత్త చిత్రంతో ప్రేక్షకులను తనివితీరా నవ్వించనున్నాడు. ఇ.సత్తిబాబు దర్శకత్వంలో అల్లరి నరేష్ ఒక కొత్త సినిమాలో నటించడానికి అంగీకరించారు. ఈ సినిమాకు ‘జంప్ జిలానీ’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాను అంబికా కృష్ణ నిర్మించనున్నారు.

అ్లలరి నరేష్ ప్రస్తుతం ‘యాక్షన్’ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తి అయిన తరువాత ‘జంప్ జిలానీ’ ప్రారంభం అవుతుంది.

కాగా, అల్లరి నరేష్- ఇ.సత్తిబాబు కలయికలో ఇప్పటి వరకూ ‘నేను’, ‘బెట్టింగ్ బంగార్రాజు’, ‘యముడికి మొగుడు’ అనే సినిమాలు వచ్చాయి. వీటిలోనే ‘బెట్టింగ్ బంగార్రాజు’ సినిమా ఫలితం మాత్రమే ఫర్వాలేదనిపించింది.

మరి, ఈ ‘జంప్ జిలానీ’ పరిస్థితి ఏమిటో కాలమే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: