కొన్ని సినిమాలు..కొన్ని క‌ధ‌లు ఒక‌రికీ రావాల్సినవి మ‌రొక‌రికీ వెళుతుంటాయి. అంతెందుకు గౌర‌వం క‌ధ బ‌న్నీకి చెబితే శిరీష్ న‌టించాడు. అరుంద‌తిలో హీరోయిన్ గా మ‌మ‌తామోహ‌న్ దాస్ నో చెబితే అనుష్క జేజ‌మ్మగా మారింది. ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఇవ‌న్నీ ష‌రా మామూలే. అయితే ఇపుడు అదే  స్టైల్లో నాగ్ కూడా రాధ‌ను మిస్ చేసుకున్నాడు.

ఇరక విక్టరీ  వెంక‌టేష్ హీరోగా మారుతి డైరెక్షన్ లో రాధ టైటిల్ తో ఓ చిత్రం రూపొంద‌నుంద‌నే వార్త అంద‌రికీ తెలిసిందే. నిజానికి ఈ సినిమా క‌ధ‌ను ముందు నాగార్జున‌కు మారుతి చెప్పాడ‌ట‌. కానీ క‌ధ క‌నెక్ట్ అవ్వలేద‌ట మ‌న్మధుడికి. దీంతో నాగ్ సైలెంట్ అవ్వడం...అదే క‌ధ‌ను విక్టరీ వెంక‌టేష్ కు చెప్పడం ...ఎనౌన్స్ అవ్వడం కూడా ట‌కాట‌కా జ‌రిగిపోయాయి. మ‌రి నాగ్ మిస్  చేసుకున్న రాధ వెంకీకి క‌లిసొస్తుందో లేదో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: