ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, స‌మంత జంట‌గా త్రివిక్రమ్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మూవీ అత్తారింటికి దారేది. ఈ మూవీకు సంబంధించిన ఫ‌స్ట్‌లుక్‌ను ఈ నెల 20న రిలీజ్ చేయ‌నున్నారు. ఇప్పటికే ఈ మూవీపై అభిమానుల్లో అంచ‌నాలు పెరిగిపోయాయి.

ఈ మూవీకు సంబంధించిన టాకీ పార్ట్ దాదాపు చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఇందులో ప‌వ‌ర్‌స్టార్ పాత్ర చాలా భిన్నంగా చూపించాడ‌ని చిత్రవ‌ర్గాలు తెలుపుతున్నాయి.జ‌ల్సా,అత్తారింటికి దారేది, మూవీల త‌రువాత వీరి కాంబినేష‌న్ హాట్రిక్‌కు సిద్దంగా ఉంది.
ప‌వ‌న్ రిజిస్టర్ చేయించుకున్న కోబ‌లి టైటిల్ గ‌ల మూవీకు దాదాపు త్రివిక్రమే డైరెక్టర్ కావ‌చ్చు.

ప‌వ‌న్ స‌ర‌స‌న తొలిసారిగా స‌మంత హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇందులో ప్రణీత కూడ కీల‌క పాత్రలో న‌టిస్తుంది. దేవీశ్రీప్రసాద్ స‌రికొత్త బాణీల‌తో ట్యూన్స్ ను రికార్డ్ చేయిస్తున్నాడు. ఈ మూవీను ఆగ‌ష్టులో రిలీజ్ చేయాల‌ని యూనిట్ ప్లాన్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: