ఎట్ట‌కేల‌కు నాగ చైత‌న్య‌ ఖాతాలో ఓ హిట్ ప‌డింది. అక్కినేని అభిమానులే కాదు.. ఆటోన‌గ‌ర్ సూర్య టీమ్ కూడా చాలా హ్యాపీగా ఫీల‌వుతోంది. ఆటోన‌గ‌ర్ సూర్య ఆర్థిక స‌మ‌స్య‌ల వ‌ల్ల‌.. ఆగిపోయిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమాని టేక‌ప్ చేయ‌డానికి నాగార్జున కూడా ఆస‌క్తి చూపించ‌లేదు. కొడుకు సినిమా హిట్ట‌య్యేస‌రికి..

మూల‌న ప‌డిన సినిమాని బ‌య‌ట‌కు తీసుకురావాల‌నిపిస్తోందట‌. త్వ‌ర‌లోనే ఆటోన‌గ‌ర్ సూర్య‌కు ఉన్న స‌మ‌స్య‌ల‌ను చ‌క్క‌బెట్టి.. ఈ సినిమాని గ‌ట్టెక్కించాల‌ని నాగ్ భావిస్తున్నార‌ట‌. మ‌రోవైపు  ఈ సినిమాని కొనేందుకు బ‌య్య‌ర్లు కూడా ఆస‌క్తి చూపిస్తున్నారు. మొత్తానికి చైతూ సినిమాకి మంచి రోజులు వ‌చ్చిన‌ట్టే.
 

మరింత సమాచారం తెలుసుకోండి: