మైకు ప‌ట్టుకొంటే చాలు.. గ‌డ‌గ‌డ మాట్లాడేస్తారు దాస‌రి నారాయ‌ణ‌రావు. ఆయ‌న‌పై అటెన్ష‌న్ క‌ల‌గాలంటే రెండు ముక్క‌లు ఎక్కువ మాట్లాడ‌తారు. లేదంటే ఏదో ఓ వివాదం ప‌ట్టుకొని త‌న‌పై ఫోక‌స్ ప‌డేలా చూసుకొంటారు. చాలాకాలం త‌ర‌వాత ఆయ‌న స‌మ్‌థింగ్ సమ్‌థింగ్ పాట‌ల వేడుక‌కు హాజ‌ర‌య్యారు. అతిథిగా వెళ్లి.. 'ఇంగ్లీషులో టైటిల్స్ పెడ‌తారేంటి?  తెలుగు ప‌దాలేమైపోయాయి..'

అంటూ నాలుగు చివాట్లేశారు. దాంతో చిత్ర బృందం గ‌తుక్కుమంది. తెలుగు సినిమాల‌కు తెలుగులో పేర్లు పెట్టాల్సిందే. దాస‌రి లాంటి పెద్ద‌వాళ్లు వ‌కాల్తా పుచ్చుకోవ‌డం కూడా క‌రెక్టే. కానీ అంత‌కు ముందు దాస‌రి చేసిందేమిటి?  ఆయ‌న 149వ చిత్రం యంగ్ ఇండియా తెలుగు టైటిలా?  ఇది వ‌ర‌కు ఆయ‌న ఫూల్స్ అనే సినిమా తీశారు. అది కూడా ఇంగ్లీషు టైటిలే క‌దా?  ఆయ‌న తీసిందేమిటి?  ఇప్పుడు మాట్లాడుతున్న‌దేమిటి?
 


మరింత సమాచారం తెలుసుకోండి: