మినీ సౌంద‌ర్య‌... అనే ఇమేజ్ సొంతం చేసుకొంది మీరా జాస్మిన్. ప‌ద్ధ‌తైన పాత్ర‌లు చేస్తూ త‌క్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకొంది. ర‌వితేజ‌, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, బాల‌కృష్ణ‌.. సినిమాల్లో నటించింది. త‌ర‌వాత‌.. స‌డ‌న్‌గా డౌన్ ఫాల్ మొద‌లైంది. తెలుగులో క‌నిపించ‌డ‌మే మానేసింది. మీరా జాస్మిన్ న‌టించిన మోక్ష‌... అనే సినిమా ఇప్పుడు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతోంది.

నిజానికి ఇది ఇప్ప‌టి సినిమా కాదు. ఎప్పుడో మూడేళ్ల క్రిత‌మే పూర్త‌యింది. కానీ ఆర్థిక సంబంధ‌మైన స‌మ‌స్య‌ల వ‌ల్ల.. ఇప్పుడు వెలుగులోకి వ‌చ్చింది. మీరా ఇందులో ఓ టిపిక‌ల్ రోల్ ప్లే చేస్తోంది. థ్రిల్ల‌ర్ త‌ర‌హాలో సాగే సినిమా ఇది. ఇందులో మీరా అంద‌రినీ భ‌య‌పెట్టేస్తుంద‌ట‌.  ఈ సినిమాతో మ‌ళ్లీ మీరా జాస్మిన్ తెలుగులో అవ‌కాశాలు సంపాదించుకొంటుందా?  కొంత కాలం పాటైనా ఈ క‌థానాయిక‌ను చూడ‌గ‌ల‌మా?  అనే ప్ర‌శ్న‌ల‌కు మోక్ష సినిమా ఫ‌లిత‌మే స‌మాధానం చెప్పాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: