అల్లరి న‌రేష్ సినిమా అన్న సంగ‌తి కూడా చూసుకోకుండా.. అనిల్ సుంక‌ర తన యాక్ష‌న్ సినిమాకి పాతిక కోట్లు ఖర్చు పెట్టాడు. ఇప్పుడు ఆ సొమ్ము ఎలా రాబ‌ట్టుకోవాలో తెలీక నానా టెన్ష‌న్ ప‌డుతున్నాడు. దూకుడు లాంటి బంప‌ర్ హిట్‌తో నిర్మాత‌గా అనిల్ సుంక‌ర పేరు మార్మోగిపోయింది. ఇప్పుడు మ‌హేష్‌తో మ‌ళ్లీ సినిమా తీస్తున్నారు.

ఆయ‌న‌కు ద‌ర్శ‌క‌త్వం అంటే మ‌మ‌కారం. అందుకే అల్లరి నరేష్‌తో యాక్ష‌న్ సినిమా తీశారు. ఎవ‌రైనా న‌రేష్ సినిమా అంటే బ‌డ్జెట్‌ని దృష్టిలో పెట్టుకొని సేఫ్ గేమ్ ఆడేస్తారు. కానీ సుంక‌ర మాత్రం... చాలా రిస్క్ చేశారు. ఏకంగా పాతిక కోట్లు పెట్టారు. పాతిక అయ్యింద‌ని బ‌య్య‌ర్లు డ‌బుల్ రేటుకి సినిమాని కొనుక్కోరు క‌దా?  ఇప్పుడు అదే జ‌రుగుతోంది. సుడిగాడు కొన్న రేటుకే సినిమాని అడుగుతున్నారు.

దాంతో అనిల్‌కి ఈ సినిమా అమ్ముకోలేక‌, ఆపులోలేక‌.. ఏం చేయాలో తెలియ‌డం లేదు. ఇది త్రీడీ సినిమా. అన్ని చోట్లా ఈ సాంకేతిక నైపుణ్యం ఉన్న థియేట‌ర్లు ఉండ‌వు. దాంతో త్రీడీ కోసం చేసిన ఖ‌ర్చు సామాన్య ప్రేక్షకుడికి అర్థం కాదు. మొత్త‌మ్మీద యాక్ష‌న్‌.. నిర్మాత‌కు మాత్రం రియాక్ష‌న్ ఇచ్చేటట్టే క‌నిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: