సౌత్ ఇండ‌స్ట్రీలో క్రేజీ హీరోయిన్ ఎవ‌రు అంటే, కుర్ర హీరోల నుండి బ‌డా హీరోల వ‌ర‌కు చెప్పే పేరు స‌మంత. మ‌రి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ స‌మంతాకు లేటెస్ట్ టైమ్స్ ఇచ్చిన సౌత్ స‌ర్వే దిమ్మదిరిగేలా చేసింది.

టైమ్స్ స‌ర్వేలో మోస్ట్ డిజ‌ర్వబుల్ ఉమెన్ ఇన్ సౌత్‌-2012 లో నెంబ‌ర్ 1 గా త‌మ‌న్నా ఎంపిక‌య్యింది. లిమిటెడ్ మూవీలు చేసుకుంటున్న న‌య‌న‌తార 2వ స్థానం, ముదురు బ్యూటీ అనుష్క 3, ఫాంలో లేని శ్రేయ 4, ప్లాఫ్‌ల హీరోయిన్ తాప్పీ 5, ఇలా పోతే స‌మంతాకు వ‌చ్చింది 9వ స్థానం. ఈ స‌ర్వే చెప్పిన ప్లేస్‌మెంట్స్‌ స‌మంతకు అంతుప‌ట్టడంలేద‌ట‌.

నేనే నెం.1 అంటూ తల బ‌రువుతో చేసే చేష్టలతో ఇండ‌స్ట్రీలో స‌మంత ఫేం కొంచెం త‌గ్గిందంటున్నారు. ప్రిన్స్‌తో వ‌రుస‌గా జ‌త‌క‌ట్టిన ఈ బ్యూటికు ల‌క్కు క‌లిసివ‌చ్చినా, అభిమానులు మ‌న‌స్సులో మాత్రం ఎక్కడో ఉండిపోయింది. అందుకే స‌ర్వే ఇచ్చిన ఫ‌లితాలపై స‌మంత సంతృప్తిగా లేదు. ఏదైమైన ఈ స‌ర్వే స‌మంత త‌ల‌బ‌రువును త‌గ్గించిందంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: