సినిమా షూటింగ్ ప్రారంభం నుంచే దేశవ్యాప్తంగా ఓ రేంజ్ లో పబ్లిసిటీ వచ్చింది. బాలీవుడ్ ఎంట్రీ అదిరిపోతుందనుకున్నారు. అయితే సీన్ రివర్స్ అవుతోంది. రామ్‌చరణ్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ 'జంజీర్'కు సినిమా కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. సంజయ్ దత్ కు సుప్రీంలో చుక్కెదురైతే.. ఇక్కడ జంజీర్ సినిమా షూటింగ్  ఆగిపోయింది. జంజీర్ లో సంజయ్ దత్  కూడా ఓ మెయిర్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే పలు సార్లు  షూటింగులు వాయిదా పడుతూ వచ్చిన మెగా పవర్ స్టార్ బాలీవుడ్ సినిమా.. అర్థంతరంగా ఆగిపోయింది. మెగా ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది.

సంజయ్ తో సినిమాలు ఉన్నాయంటూ.. సంజయ్‌దత్ నిర్మాతలు సుప్రీంలో పిటిషన్ వేశారు. పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. తాము నిర్మించే సినిమాలు నిర్మాణ దశలో ఉన్నందున సంజయ్‌దత్ లొంగిపోయేందుకు గడువు పొడిగించాలని నిర్మాతలు కోర్టును కోరారు. అయితే తాజాగా ఈ పిటీషన్ ను సుప్రీం తోసి పుచ్చింది. వెంటనే కోర్టుకు లొంగిపోవాలని సంజయ్ కి సూచించింది.

సంజయ్ కేసుతో జంజీర్ నిర్మాత షాక్ కి గురయ్యారు. నిర్మాణ హక్కులపై గతంలో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ కేసుతో చాలా కాలంగా రామ్‌చరణ్ చిత్ర నిర్మాణం ఆగిపోయింది. ఈ కేసుకు ఇప్పుడు తాజాగా సంజ్ కేసు యాడ్ అయింది. ఇప్పుడీ చిత్ర నిర్మాణం మరింత జాప్యం జరగనుంది.

ఇప్పటికే బాలీవుడ్ ఐరన్ లెగ్ అంటూ రామ్‌చరణ్ ని చెప్పుకుంటున్నారు. తాజా తీర్పుతో  ఈ ఒపీనియర్ మరింత బలపడినట్లైంది. రామ్‌చరణ్ తో సినిమా తీయడానికి  బాలీవుడ్ నిర్మాతలు వెనుకడుగేస్తున్న నేపధ్యంలో.. ఇది మరింత ఇబ్బందిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: