హీరోయిన్ గా తెర‌పై క‌నిపించాల‌ని తెగ ఉత్సాహం చూపించి చివ‌ర‌కీ నితిన్ తో గుండె జారి గ‌ల్లంత‌య్యిందేలో ఓ ఐటం సాంగ్ చేసిన క్రీడాకారిణి గుత్తాజ్వాల‌.  ఈ  ఐటం సాంగ్ లో  న‌న్ను స్టెప్స్ వేయ‌మ‌ని నితిన్ నా చేతులు ప‌ట్టుకున్నాడంటూ  తెగ బిల్డప్ ఇచ్చిన ఈ బ్యూటీ ...సినిమా రిలీజ్ అయ్యాక ప‌రువు పోగొట్టుకుంది. అస‌లు ఆమె 5 నిమిషాల పాట‌లో క‌నిపించింది అర నిమిష‌మే అయినా ఇక చాలు బాబోయ్ నీ డాన్స్  ఆపు  అని ఆడియెన్స్ అనేంత‌గా జ్వాల గెంతింది.
ఆ సంగతి ప‌క్కన పెడితే ఈ భామ ఈ మ‌ద్య హీరో, మోడ‌ల్ హ‌ర్షవ‌ర్ధన్ తో డేటింగ్ చేస్తున్నదంటూ జోరుగా ప్రచారం జ‌రుగుతోంది.  నిజానికి కొంత‌కాలంగా ఈ ఇద్దరూ  క‌లిసి తిరుగుతున్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.  జ్వాల హాజ‌ర‌య్యే ప్రతి ఫంక్షన్ కు హ‌ర్షవ‌ర్దన్ అక్కడ వాలిపోయి ప‌క్కనే కూర్చోని స‌ర‌సాలు ఆడుతున్నాడు. అయితే త‌కిట త‌కిట‌,అవును లాంటి సినిమాల్లో హీరోగా న‌టించిన హ‌ర్ష వ‌ర్ధన్ తో నాకు వుంది కేవ‌లం ప్రెండ్ షిప్ అంటూ జ్వాల జోకులేస్తుంది. మ‌రి ఈ ఇద్దరి మ‌ద్య ఏం లేకుండానే అంత‌గా తిరుగుతున్నారా ..? అని ఇదంతా చూస్తున్నవాళ్ల బిగ్ డౌట్.
 

మరింత సమాచారం తెలుసుకోండి: