సినిమా లెక్క‌ల ప్ర‌కారం వేస‌వి సీజ‌న్ చాలా కీల‌కం. స్కూళ్లూ, కాలేజీల‌కు సెల‌వ‌లు వ‌స్తాయి. వాళ్లంతా సినిమా థియేట‌ర్ల‌వైపు ప‌రుగులు పెడ‌తారు. ఎన్ని సినిమాలు వ‌చ్చినా - మ‌రో సినిమా చూసేంత తీరిక ఇప్పుడే దొరుకుతుంది. అందుకే ఈ సీజ‌న్‌లో త‌మ సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని నిర్మాత‌లు భావిస్తుంటారు. ఈ వేస‌వికీ బోలెడ‌న్ని సినిమాలొచ్చాయి. అయితే సమ్మ‌ర్ హంగామాని క్యాష్ చేసుకొన్న సినిమాలు ఒక‌టో, రెండో?

ఎన్టీఆర్‌, వెంక‌టేష్‌, నాగార్జున‌లాంటి బ‌డా హీరోల సినిమాలు ఈ వేస‌వికి వ‌చ్చాయి. నికార్స‌యిన విజ‌యాన్ని ఒక్కరూ న‌మోదు చేసుకోలేక‌పోయారు. నితిన్ సినిమా గుండెజారి గ‌ల్లంత‌య్యిందే ఒక్క‌టే క్లీన్ హిట్‌గా నిలిచింది. రూ.8 కోట్ల‌తో పూర్త‌యిన ఈ సినిమా... ఏకంగా రూ.20 కోట్లు సాధించింది. పోయిన నితిన్ ఇమేజ్ ఈ సినిమాతో పూర్తిగా తిరిగొచ్చింది. నిఖిల్ సినిమా స్వామి రారాకీ కొన్ని డ‌బ్బులొచ్చాయి. నాగ‌చైత‌న్య త‌డాఖా చూపించాడు. అంటే పెద్ద హీరోల కంటే... జూనియ‌ర్లే బెట‌ర్ అన్న‌మాట‌. ఈ వేస‌విలో ఇద్ద‌ర‌మ్మాయిలు మిన‌హా.. మ‌రో పెద్ద సినిమా వ‌చ్చే అవ‌కాశం లేదు. ఆ సినిమాపై కూడా ఎవ‌రికీ నమ్మ‌కాల్లేవు. అంటే ఈ వేస‌వి హీరో.. నితినే అన్న‌మాట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: